స్వీట్ పొటాటోను చిలగడ దుంప లేదా గంజి గడ్డలు అని కూడా పిలుస్తారు. స్వీట్ పొటాటోలో మన శరీర జీవక్రియలకు అవసరమైన అన్ని రకాల విటమిన్స్, మినిరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, బీటాకేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. కావున స్వీట్ పొటాటోలను తరచు ఆహారంలో నిక్షేపంగా తినొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వీట్ పొటాటోలో అధిక కేలరీలు మన శరీరానికి లభిస్తాయి కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు వీటిని తక్కువగా తీసుకోవాలి.మరియు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
తరచూ స్వీట్ పొటాటోను మన డైట్ లో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.స్వీట్ పొటాటోలో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ సిస్టం బలోపేతం చేస్తాయి. అలాగే శరీరంలో ఏర్పడి ఫ్రీ రాడికల్స్ ను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
చిలకడదుంపల్లో పుష్కలంగా పీచు పదార్థం ఉండి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి ప్రేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తుంది.
స్వీట్ పొటాటోలు సమృద్ధిగా లభించే పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్ మూలకాలు శరీర దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. నాడీ కణ వ్యవస్థ లోపాలను సవరించి మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. స్వీట్ పొటాటోలో సమృద్ధిగా ఉండేవిటమిన్ సి ఐరన్ మూలకాన్ని ఎక్కువగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా ప్రమాదకర రక్తహీనత సమస్యను ఎదుర్కొనవచ్చు. చిలగడ దుంపల్లో ఉండే సహజ శక్తివంతమైన ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నిర్జీవం చేసి యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కంటి చూపులు మెరుగుపరుస్తుంది.