రోజువారి ఆహారంలో ఆవాలను ఈ సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా తినాల్సిందే!

మన రోజు వారి ఆహారంలో ఉపయోగించే ఆవగింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆవాలను మరియు ఆవనూనెను ఆయుర్వేద వైద్యంలో అనేక వ్యాధులు నయం చేయడానికి ఇప్పటికి ఉపయోగిస్తున్నారు. ఆవాల్లో సమృద్ధిగా విటమిన్ ఏ, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్,
మెగ్నిషియం, మాంగ‌నీస్, కాల్షియం, జింక్, ఐరన్ , పొటాషియం, సోడియం వంటి ఎన్నో పోషక పదార్థాలు మరియు ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్నందున మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు నాలుగు గ్రాముల ఆవగింజలను ఆహారంలో తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ లోపాలు తొలగిపోవడమే కాకుండా శరీరంలో చెడు వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఘాటైన ఔషధ గుణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆవాల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్స్ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.

ఆవ నూనెలో విటమిన్ ఈ,విటమిన్ ఏ,యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు పుష్కలంగా ఉంటుంది. కావున వీటి నుంచి తీసిన నూనెను అప్పుడప్పుడు తలకు మర్దన చేసుకుంటే వెంట్రుకలు మృదువుగా దృఢంగా పెరుగుతాయి. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాల కారణంగా చుండ్రు, కురుపులు, దురదలు వంటి సమస్యలను అరికట్టవచ్చు.కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది.