అలోవెరా జ్యూస్ లో దాగి ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కనుక తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం!

సాధారణంగా మన ఇంటి పెరట్లో పెంచుకునే (అలోవెరా) కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. ఈ కలబందను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగాను అలాగే మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఎక్కువగా ఫేస్ ప్రోడక్ట్లలోను కలబందన ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే అలోవెరా నుంచి తీసినటువంటి ఈ కలబంద గుజ్జును కనుక తీసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టవచ్చు. మరి కలబంద గుజ్జులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే….

అలోవెరా మొక్క గుజ్జును ప్రతిరోజు మన ఆహారంలో తీసుకున్నట్లయితే చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒళ్ళు నొప్పులు, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులను నియంత్రణలో ఉంచవచ్చు. అలోవెరా గుజ్జులో విటమిన్స్, మినరల్స్, సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియన్ గుణాలు, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తాయి కావున ప్రతిరోజు ఉదయాన్నే అలోవెరా గుజ్జులో నిమ్మ రసాన్ని జోడించి సేవించినట్లయితే మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రతిరోజు క్రమం తప్పకుండా అలోవెరా గుజ్జుకు నిమ్మరసం, తేనె ,పుదీనా కలిపి ప్రతిరోజు సేవిస్తే ఇన్సులిన్ ఉత్పత్తి సహజంగా జరిగి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి గ్యాస్ట్రిక్ మలబద్ధకం విరోచనాలు వంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు మలినాలైనా క్యాన్సర్ కణాలను నియంత్రించి చర్మ క్యాన్సర్, ఉదర క్యాన్సర్, లివర్ క్యాన్సర్ రాకుండా మనల్ని రక్షిస్తుంది. అలోవెరా గుజ్జు మొహానికి రాయటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.