వాళ్లకు కొబ్బరి బోండాలు విషంతో సమానమట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మనలో ప్రతి ఒక్కరూ కొబ్బరి బోండాలను ఎంతో ఇష్టంగా తాగుతారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కొబ్బరి నీళ్లలో సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. షుగర్ తో బాధ పడేవాళ్లు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.

ఇప్పటికే షుగర్ తో బాధ పడుతున్న వాళ్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆ షుగర్ అంతకంతకూ పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తీసుకుంటే కొంతకాలం తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ బాధితులు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరే ఛాన్స్ అయితే ఉంటుంది.

కొబ్బరి నీళ్లలో సాధారణంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్లు మాత్రం కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంచే మంచిది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం కిడ్నీలకు హాని చేస్తుందని చెప్పవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు సైతం కొబ్బరి నీళ్లు హాని చేసే అవకాశం అయితే ఉంటుంది.

బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. లో బీపీ ఉన్నవాళ్లకు కొబ్బరి నీళ్ల వల్ల నష్టమే తప్ప లాభం అయితే ఉండదని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరంలో సరైన ద్రవ సమతుల్యతను కాపాడుకుంటాయి. కొబ్బరి నీళ్లు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడతాయని చెప్పవచ్చు.