నిత్యం బిగుతైన దుస్తులు ధరిస్తున్నారా… మీకు ఈ సమస్యలు తప్పవు!

సాధారణంగా ట్రెండ్ కు అనుగుణంగా మన వ్యవహార శైలితో పాటు వస్త్రధారణ విషయంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ మధ్యకాలంలో వస్త్రధారణ విషయంలో అమ్మాయిల తీరు పూర్తిగా మారిపోయింది ఏకంగా అబ్బాయిలు మాదిరిగా టైట్ దుస్తులను ధరిస్తూ ఉన్నారు అయితే ఇలా అమ్మాయిలు తరచూ బిగుతైన దుస్తులు ధరించడం వల్ల వారు ఎంతో అందంగా కనపడినప్పటికీ వారికి తెలియకుండానే వారు ఎన్నో రకాల చర్మ సమస్యలతో ఇబ్బంది పడతారని చెప్పాలి.

ఈ విధంగా తరచూ బిగుతైన దుస్తులు దరించడం వల్ల మన శరీరాకృతి ఎంతో అందంగా కనపడుతుంది అయితే మనకు తెలియకుండానే ఎక్కువగా చమట బయటకు వెళ్ళబడుతూ టైట్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల ఈ స్వేద రంధ్రాలు మూసుకుపోయి శబం విడుదల కాదు. తద్వారా ఒక అబ్బాయి మొటిమలు మచ్చలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు శ్వాసక్రియ తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇలా బిగువైన దుస్తులు ధరించడం వల్ల నడుము దగ్గర బిగుతుగా ఉండే దుస్తులు కడుపు మీద ఒత్తిడి పెంచుతాయి. ఇది జీర్ణక్రియ సమస్యలకు ఇబ్బందులు తలెత్తలా చేస్తుంది. చర్మం పై ఇరిటేషన్ కలిగి దురద ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి.ఇక చాలామంది వ్యాయామం చేసిన తర్వాత అలాగే ఉండిపోతారు అయితే వెంటనే స్నానం చేసే దుస్తులు మార్చుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. బిగుతుగా ఉండే దుస్తుల చర్మం మీద ఒత్తిడి పెంచడమే కాదు రక్త ప్రసరణకు కూడా అంతరాయం కలిగిస్తాయట. ఫలితంగా నాడీ సమస్యలు వస్తాయి.