ముదురు ఆకుపచ్చ రంగులో క్యాలీఫ్లవర్ లా కనిపించే
బ్రోకొలి ఒక నేచురల్ డిటాక్స్ ఫుడ్ అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతుంటారు.బ్రోకొలిలో యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియన్స్ ను కలిగి ఉండి మనలో సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. తరచూ బ్రోకలీ నీ ఆహారంగా తీసుకుంటే మన అనిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి5, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బ్రోకలీని తరచూ ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, కెరటినాయిడ్స్ ,టూటిన్, బీటా కెరటిన్ శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలైన విషపదార్థాలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది అందుకే క్యాన్సర్ కారకాలతో పోరాడే అత్యుత్తమ ఆహార పదార్థాల్లో బ్రొకొలి కి ప్రథమ స్థానం ఇవ్వబడింది. బ్రోకలీలో సమృద్ధిగా లభించే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా పొట్టలోని చెడు మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.బ్రొకొలిలో ఇతర కూరగాయల్లో కంటే ఎక్కువగా క్యాల్షియం, మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి కావున ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడి ఆర్థరైటిస్,రికేట్స్, రుమటాయిడ్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
షుగర్ వ్యాధితో బాధపడేవారు వారంలో రెండు లేదా మూడు సార్లు బ్రోకలీని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి షుగర్ వ్యాధిని నియంతనంలో ఉంచుతుంది.ఇందులో ఉండే ఎంజైమ్స్, అమైనో ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.