రోజువారి డైట్ లో వీటిని తింటే గుండె జబ్బుల ప్రమాదాలతో డాక్టర్ల దగ్గరకు పరుగు పెట్టాల్సిన అవసరం ఉండదు!

ఈ రోజుల్లో గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఎక్కువమంది డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. గుండె సమస్యలు తలెత్తడానికి ముఖ్య కారణం రోజువారి ఆహారంలో అత్యధిక కొలెస్ట్రాల్ కలిగిన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేయబడ్డ మాంసాహారాన్ని ఎక్కువగా తినడం, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వినియోగించడం, శారీరక శ్రమ లోపించడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.ఇప్పటికైనా మేల్కొని గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలని రోజువారి డైట్ లో చేర్చుకుంటే భవిష్యత్తులో గుండె వ్యాధులతో డాక్టర్ల దగ్గరకు పరుగు పెట్టాల్సిన అవసరం ఉండదు.

గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.అందరూ అపోహ పడుతున్నట్లుగా ప్రతిరోజు గుడ్డు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతినదు. గుడ్డులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు గుండె అనారోగ్యానికి కారణమయ్యే చెడుకొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక సర్వేల్లో వెల్లడైంది కనుక నిత్యపన ప్రతిరోజు గుడ్డును తినొచ్చు. అలాగే వారంలో మూడు సార్లు కచ్చితంగా సాల్మన్ జాతికి చెందిన చేపలను తింటే వీటిల్లో సమృద్ధిగా లభించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

మన రోజువారి డైట్ లో బ్రోకలీ, అవకాడో, పాలకూర, క్యారెట్ వంటివి కచ్చితంగా ఉండునట్లు చూసుకుంటే భవిష్యత్తులో గుండె జబ్బు ముప్పు తప్పినట్లేనని నిపుణులు చెబుతున్నారు. రోజువారి ఆహారంలో అలివ్ ఆయిల్ ను తీసుకుంటే వీటిల్లో సమృద్ధిగా లభించే విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, పొటాషియం, శక్తివంతమైన ఎంజైమ్స్ రక్తప్రసరణ లోపాలను తొలగించి గుండెపోటు ప్రమాదం తగ్గిస్తుంది. రోజువారి డైట్ లో ఓట్ మిల్ నీ తింటే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ నిల్వలను నియంత్రిస్తుంది. ప్రతిరోజు వైట్ రైస్ కు బదులు తృణధాన్యాలైన జొన్నలు కొర్రలు రాగులు వంటివి ఆహారంగా తీసుకుంటే వీటిల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మరియు రక్తంలో గ్లూకోస్ ను నియంత్రించి డయాబెటిస్ వ్యాధి నీ అదుపులో ఉంచుతాయి.