క్యాన్సర్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలంటే ఇదొక్కటే ఉత్తమమైన మార్గం!

మనకు ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో రణపాల మొక్కకు ఆయుర్వేద వైద్యంలో విశిష్ట స్థానం ఇవ్వబడిందీ సాధారణంగా రణపాల మొక్కను ఇంటి పెరట్లో నిక్షేపంగా పెంచుకోవచ్చు. ప్రతిరోజు ఈ మొక్క కషాయాన్ని సేవిస్తే వందకు పైగా రోగాలను సహజ పద్ధతిలో సులువుగా నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. రణపాల మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రణపాల మొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కావున
ప్రతిరోజు మూడు స్పూన్ల రణపాల రసాన్ని తాగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అన్ని రకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

ప్రతిరోజు ఒక చెంచాడు రణపాల రసం తాగితే రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు అలాగే రణపాల రసాన్ని కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కళ్ళు ఎర్రబడడం ,కళ్ల మంటలు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మూడు నెలలపాటు ప్రతిరోజు రణపాల ఆకులను పరగడుపునే బాగా నమిలి మింగిన తర్వాత మంచి నీళ్లు తాగి అరగంట వరకు ఏమీ తినకుండా ఉంటే ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు ఉదర క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చర్మ మరియు రొమ్ము క్యాన్సర్లను నియంత్రించడంలో సహాయపడతాయి.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు , నడుము నొప్పి, తల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు రణపాల మొక్క ఆకులను సేకరించి అందులో కొంత పసుపు కలిపి మెత్తగా నూరి నొప్పి ఉన్నచోట మర్దన చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరియు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు
ప్రతిరోజు ఉదయాన్నే ఒక రణపాల మొక్క ఆకును బాగా నమిలి లాలాజలంతో అలాగే మింగి గ్లాసుడు మంచినీళ్లు తాగి అరగంట వరకు ఏమీ తినకూడదు ఇలా కొన్ని రోజులపాటు చేస్తే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.