ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బోడ కాకరకాయలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు, ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. సాధారణ కాకరకాయకు భిన్నంగా ఉండే బోడ కాకరను బొంత కాకర, అగాకర, అడవి కాకర అనే పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు.బోడ కాకరలో విటమిన్ సి, విటమిన్ ఏ ,విటమిన్ డి,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి శీతాకాలంలో వచ్చే అన్ని రకాల అలర్జీలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది
క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువగా ఉన్న బోడ కాకరలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతుంది.బోడ కాకరలో పోలెట్ అధికంగా ఉంటుంది ఇది శరీర కణాల ఎదుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న లూటీన్ వంటి కెరోటినాయిడ్స్ అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడి హృదయ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు,కంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
బొడ కాకర మార్కెట్లో ఖరీదైనప్పటికీ వీటిని ఆహారంగా తీసుకుంటే అనేక దీర్ఘకాలిక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ ఇన్సులిన్ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది.బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబందకం, అజీర్తి ,గ్యాస్టిక్ సమస్యలను తొలగిస్తుంది. మూత్రశయ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తరచూ బోడ కాకరకాయను ఆహారంగా తీసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ క్యాన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.