ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మైగ్రేన్ సమస్య వేధిస్తోంది. మైగ్రేన్ వచ్చినప్పుడు ఉపశమనం కోసం, చీకటి గదిలో విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చల్లని ప్యాక్ ను నుదుటిపై ఉంచి తగినంత నీరు త్రాగడంతో పాటు కెఫిన్ తో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కాంతి మరియు ధ్వని మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.
డీ హైడ్రేషన్ కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ కావడం గమనార్హం. తగినంత ద్రవాలు త్రాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది నొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మైగ్రేన్ ప్రారంభంలో కొద్దిగా కెఫిన్ ఉపయోగించడం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఇది మైగ్రేన్ ట్రిగ్గర్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు.
రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా సులువుగానే మైగ్రేన్ లను నివారించవచ్చు. కొన్ని ఆహారాలు, పానీయాలు, వాతావరణ మార్పులు, లేదా ఒత్తిడి మైగ్రేన్ ట్రిగ్గర్‌లు అయ్యే అవకాశం ఉంటుంది. మైగ్రేన్‌ను నిర్వహించడానికి మీకు సహాయపడే మందులు లేదా ఇతర చికిత్సలను ఉపయోగించవచ్చు. పిప్పరమింట్ / లావెండర్ నూనె మైగ్రేన్ సమయంలో ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది.
లైట్లు మసకబారడం, శబ్ద స్థాయిలను తక్కువగా ఉంచడం మరియు బలమైన వాసనలను నివారించడం ద్వారా మైగ్రేన్ కు చెక్ పెట్టవచ్చు. ఇతర కాలలతో పోల్చి చూస్తే సమ్మర్ లో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.