ఈ మూడు లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువట!

11_07_2022-heart-attack-symptoms_22881533

మనలో చాలామంది నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని భావిస్తారు. అయితే ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజల్లో టెన్షన్ పెరుగుతోంది. అయితే మూడు లక్షణాలు ఉంటే మాత్రం గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే షుగర్, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినేవాళ్లకు కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేని వాళ్లు, వ్యాయామం చేయని వాళ్లకు కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తరచూ ఛాతీలో నొప్పి వస్తున్నా, గుండె కదులుతున్నట్టు అనిపించినా, ఎడమ చెయ్యి ఎక్కువగా లాగుతున్నట్టు అనిపించినా గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా ప్రకారం నడుచుకుంటే మంచిదని చెప్పవచ్చు. గుండెకు సంబంధించి చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు.

సొంత వైద్యంపై ఆధారపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి కోలుకోవచ్చు. గుండె అతి ముఖ్యమైన అవయవం కావడంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు సక్రమంగా పని చేయాలంటే గుండె సరిగ్గా పని చేయాలి. గుండె ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు.