వర్షాకాలం మొదలైతే చాలు వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చికెన్ గునియా మలేరియా డెంగ్యూ వంటి రోగాలతో ప్రజలు తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో దోమలు బాగా వృద్ధి చెందుతాయి. ఈ దోమల వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చిన్న పిల్లలని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులనుండి బయటపడటానికి కొన్ని ఆహారపు అలవాట్లు చేర్చుకోవాలి. మలేరియా వ్యాది నుండి బయటపడటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
వర్షాకాలంలో దోమల కాటు వల్ల మలేరియా వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ఈ మలేరియా వ్యాధి సోకినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. అందువల్ల మలేరియా వ్యాధి సోకినవారు వారు వారు తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్ల ఈ వ్యాధి నుండి బయటపడవచ్చు. మలేరియా సోకిన వారు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి నశించటం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పెంచుకోవటానికి బొప్పాయి పండు బాగా ఉపయోగపడుతుంది. మలేరియా వ్యాధి సోకిన వారు ప్రతిరోజు బొప్పాయి పండు తినటం, బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించాలి తర్వాత అన్నిటిని వడపోసి దానిలో కొంచెం తేనె కలిపి ప్రతి రోజు తాగటం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ క్రమంగా పెరుగుతుంది.
మలేరియా వ్యాధి నుండి బయటపడటానికి మెంతులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మన వంటింట్లో లభించే మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెంతుల్లో యాంటీ-ప్లాస్మోడియం ఉండటంవల్ల ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి మలేరియా వైరస్ ను తొలగించడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు కొన్ని మెంతులను రాత్రిపూట నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల మలేరియా వ్యాధి నుండి తొందరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఆ మెంతి గింజలను కూడా మెత్తగా రుబ్బి తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం కొన్ని నీటిలో అల్లం వేసి బాగా మరిగించి దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.