బొప్పాయి ఆకుల రసం కలిగే లాభాలు మీకు తెలుసా.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

మనలో చాలామంది బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో ఉపయోగపడుతుంది. బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే పుష్కలంగా ఉండగా ఆయుర్వేద మందుల్లో సైతం బొప్పాయి ఆకుల రసాన్ని వినియోగిస్తారు. పాపైన్‌, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు బొప్పాయిల ద్వారా లభిస్తాయనే సంగతి తెలిసిందే.

కడుపుఉబ్బరం, ఇతర జీర్ణరుగ్మత సమస్యలకు బొప్పాయి ఆకుల రసంతో సులువుగా చెక్ పెట్టవచ్చు. చుండ్రు, బట్టతల రాకుండా చేయడంలో బొప్పాయి ఆకుల రసం తోడ్పడుతుంది. బొప్పాయి ఆకులో విటమిన్‌ ఏ, సి, ఇ, కె, బి ఇతర విటమిన్లు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్యాల చికిత్సకు, ఆరోగ్యాన్ని రక్షించడానికి బొప్పాయి ఆకు టీ, జ్యూస్‌, మాత్రలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

బొప్పాయి ఆకుల జ్యూస్‌ తాగడం ద్వారా డెంగీ లక్షణాల సమస్యకు చెక్ పెట్టవచ్చు. జ్వరం, అలసట, తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, వాంతులు వంటి డెంగీ లక్షణాల నుంచి బొప్పాయి ఆకుల రసం దూరం చేస్తుంది. బొప్పాయి ఆకు సారం రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలను విపరీతంగా పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను బొప్పాయి ఆకుల జ్యూస్ తోడ్పడుతుంది.

బొప్పాయి ఆకు జ్యూస్‌ గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి జీర్ణ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పెద్ద ప్రోటీన్‌ను చిన్నదిగా, సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్‌లు, అమైనో యాసిడ్‌గా విభజించడంలో ఇది తోడ్పడుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండగా బొప్పాయి ఆకు సారం ఆర్థరైటిస్‌తో ఉన్న ఎలుకల పాదాలలో మంట, వాపును గణనీయంగా తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బొప్పాయి ఆకుల రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. శరీరంలో అధిక స్థాయి ఆక్సీకరణ ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేస్తుందని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. యాంటీఆక్సిడెంట్-రిచ్ డైట్ తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, జుట్టు పెరుగుదల మెరుగు పడే అవకాశాలు అయితే ఉంటాయి. యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను నివారిస్తాయి.