మనలో చాలామంది ఆహారాన్ని వేడిగా తినడానికి ఇష్టపడతారు. వేడి ఆహారం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొన్నిసార్లు ఆహారాలను వేడి చేయడం వల్ల ఆ ఆహారాలు విషపూరితం అయ్యే అవకాశం ఉంది. ఆహారాన్ని వేడి చేసుకుని తినేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆహార పదార్థాలను పదేపదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు నశించే ఛాన్స్ ఉంది.
ఆలుగడ్డలతో చేసిన వంటకాలను పదేపదే వేడి చేయకూడదు. బంగాళదుంపలను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చికెన్ ను వేడి చేయడం వల్ల అందులో ఉండే సాల్మొనెల్లా జీర్ణం కావడం కష్టమవుతుంది. బచ్చలికూరను వేడి చేసి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బచ్చలికూరలో ఉండే నైట్రేట్లు శరీరానికి ఒకింత హాని చేసే అవకాశం ఉంటుంది. గుడ్లను పదేపదే వేడి చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్లను ఎక్కువగా వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్లు నశించే ఛాన్స్ ఉంటుంది. ఆహారాలను పదేపదే వేడి చేయడానికి బదులుగా అవసరానికి అనుగుణంగా వండుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఆహారం విషయంలో తప్పులు చేస్తే తిప్పలు తప్పవని చెప్పవచ్చు. వేడి ఆహారం తినడం వల్ల దీర్ఘ కాలంలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మాడిపోయిన ఆహారం తినడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందనే విషయాలను గుర్తుంచుకోవాలి.