మనలో చాలామంది రాగిజావను ఎంతో ఇష్టంగా తాగుతారు. రాగిజావలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మలబద్ధకం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించే విషయంలో రాగిజావ ఎంతగానో తోడ్పడుతుంది.
రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుందని చెప్పవచ్చు. రాగిజావలో ఉండే పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాగిజావ గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాగిజావ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి.
రాగిజావ ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుందని చెప్పవచ్చు. రాగిజావలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి పోషకాహార లోపాలను నివారించే అవకాశాలుంటాయని చెప్పవచ్చు. రాగిజావ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఎండకాలంలో రాగిజావ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. రాగిజావ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. రాగిజావ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది.
రాగిజావను అధికంగా తాగడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, అలెర్జీలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. రాగిలో అధిక ఫైబర్ ఉండటం వల్ల, కొంతమందిలో జీర్ణక్రియ సరిగా జరగకపోవచ్చు, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.