సంతానలేమి సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన పండ్లు ఇవే?

ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అవకాడో పండ్లలో మన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. అవకాడో పండ్లను వెన్న పండు అని కూడా అంటారు. ఈ పండు గుజ్జులో అత్యధికంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అత్యధికంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి6, బీ 9 వంటి అనేక సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అవకాడో పండ్లు కొంత ఖరీదు అయినప్పటికీ అప్పుడప్పుడు వీటిని ఆహారంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అధిక శరీర బరువు సమస్య కలిగిన వారు తరచూ అవకాడో పండ్లను ఆహారంగా తీసుకుంటే ఈ పండు గుజ్జులో అత్యధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించి మన శరీర పోషణకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయ పడడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉన్న పొటాష్ రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

తీవ్ర మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడేవారు, విద్యార్థులు తరచూ ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఈ పనులలో అత్యధికంగా ఉన్న మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్ బి12 వంటి పోషకాలు నాడీ కణ వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరిచి డిప్రెషన్, ఆందోళన, చికాకు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ పండులో ఉన్న అద్భుత ఔషధ గుణాలు వీర్యాభివృద్ధికి తోడ్పడి సంతానలేమి సమస్యను తొలగిస్తుంది. ఈ పనులు అత్యధికంగా ఉన్న పోలేట్ రక్త కణాలను అభివృద్ధి చేసి మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గర్భంలోని శిశువు ఎదుగుదలకు నాడీ కణ అభివృద్ధికి సహాయపడుతుంది.

ముఖంపై మడతలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో బాధపడేవారు అవకాడో పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉన్న విటమిన్ ఎ, సి, ఇ మరియు మినరల్స్ చర్మ కణాలకు తగిన శక్తిని అందించి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ ఏ కంటిలోని రెటీనాను రక్షించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ పండ్లలో అత్యధికంగా ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ జింకు వంటి ఖనిజ లవణాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడి ఆస్తియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నయం చేస్తుంది.