గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవలసిన ఆరు పోషకాలు ఇవే!

pregnant-woman

సాధారణంగా ప్రతి మహిళ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన మహిళలు తమకు పుట్టబోయే బిడ్డ విషయంలోనూ అలాగే తమ ఆరోగ్య విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయానికి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అప్పుడే తల్లి బిడ్డల ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఈ ఆరు పోషక పదార్థాలు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

గర్భం దాల్చిన మహిళలు తమ ఆహారంలో భాగంగా ఐరన్, కాల్షియం, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, డిహెచ్ఏ వంటి ఆరు పోషకాలు తప్పకుండా తీసుకోవాలి. ఇలా ఈ ఆరు పోషకాలు మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈ పోషకాలు మనకు బయట క్యాప్సిల్స్ రూపంలో కూడా లభిస్తాయి కనుక వాటిని కూడా తీసుకోవటం వల్ల తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలా ఈ సమస్యతో బాధపడే వారిలో బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి వీటితో పాటు క్యాల్షియం కూడా అధికంగా ఉండడం చేత బిడ్డ ఎదుగుదలకు అలాగే బిడ్డ శరీరంలోని ఎముకలు దృఢత్వానికి కూడా తోడ్పడుతుంది. ఇలా పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు పండ్లు, పాలు పాల పదార్థాలను కూడా అధికంగా తీసుకోవాలి.