హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే అద్భుతమైన చిట్కాలు ఇవే.. ఆ సమస్యలకు సులువుగా చెక్!

hemoglobin_650x400_81522058468

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఉండాల్సిన లెవెల్ కంటే తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు వేధిస్తాయనే సంగతి తెలిసిందే. పోషకాల లోపం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. ఐరన్ బ్లాకింగ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలు, చీజ్ లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదు. టీ, సోడా, కాఫీ, ఆల్కహాల్ లకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

గ్లూటెన్ ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తీసుకోవడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రాగి పాత్రలోని నీళ్లు తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రాగిపాత్రలోని నీరు జీవక్రియను పెంచడంతో పాటు జీర్ణక్రియను ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. పరగడుపున రాగిపాత్రలోని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది.

హెర్బల్ టీలు తాగడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డాండెలైన్, ఎరుపు కోరిందకాయ ఆకుల్లో ఐరన్ ఎక్కువగా ఉండగా ఇవి తీసుకోవడం ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. హెర్బల్ టీ తాగడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

బచ్చలికూర, వేరుశెనగ, కిడ్నీ బీన్స్, అవకాడో, పాలకూర తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న సమయంలో ఈ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హిమో గ్లోబిన్ స్థాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.