లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుత ఆహార పదార్థాలు ఇవే!

Human-Liver

మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటికి పంపడంలో లివర్ పాత్ర కీలకమైనది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే చెడు వ్యర్ధాలను బయటికి పంపి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తిలో లివర్ సహాయపడుతుంది. అయితే ఈ రోజుల్లో మనం తీసుకునే అత్యధిక కొలెస్ట్రాల్ ,కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తి లివర్ పనితీరు మందగిస్తోంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

లివర్ ఆరోగ్యాన్ని రక్షించే డిటాక్స్ ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడంలో బీట్రూట్ సహాయపడుతుంది. బీట్రూట్ లో బీటాలైన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడం వల్ల లివర్ ను డిటాక్స్ చేయడంలో తోడ్పడుతుంది.

ప్రతిరోజు గ్రీన్ టీ సేవించే వారిలో లివర్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువని అనేక సర్వేలో వెల్లడింది. కారణం గ్రీన్ టీ లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విష వ్యర్థాలను సులభంగా బయటికి పంపించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

లివర్ ఆరోగ్యాన్ని రక్షించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే అలిసిన్, డైఅలి, డై సల్ఫైడ్ అనే రసాయన సమ్మేళనాలు లివర్ వ్యాధులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.మరియు వెల్లులిలో సిలినీయం అనే రసాయనం ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రూపాంతరం చెంది చెడు వ్యర్ధాలను విసర్జించడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పును ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ లివర్ ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు ద్రాక్ష, బెర్రీ పండ్లను ఆహారంగా తీసుకోవడంతో పాటు వీటి జ్యూస్ సేవిస్తే చెడు మలినాలు సులభంగా తొలగిపోయి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.