అమ్మాయిలను పీరియడ్స్ సమయంలో వేర్వేరు సమస్యలు వేధిస్తాయి. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పి వల్ల అమ్మాయిలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పీరియడ్స్ నొప్పిని సులువుగా తగ్గించుకోవడంతో పాటు ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలు దూరమవుతాయి.
హైడ్రేటెడ్ గా ఉండటం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. నీటిలో తులసి ఆకులను మరిగించి చల్లారిన నీటిని తాగడం ద్వారా పీరియడ్స్ నొప్పికి తక్షణమే చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అరటి ఆకును నీటిలో ఉడికించి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వాము నీటిని తాగడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పి దూరమవుతుంది.
బెల్లంను నములుతూ ఉండటం ద్వారా కూడా పీరియడ్స్ నొప్పిని సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. నీళ్లలో మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగడం ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పీరియడ్స్ సమయంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే మంచిది. ఆయిలీ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పీరియడ్స్ సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. వాకింగ్, యోగా చేయడం వల్ల పీరియడ్స్ నొప్పి దూరమవుతుందని చెప్పవచ్చు. పీరియడ్స్ నొప్పితో బాధ పడే యువతులు, మహిళలు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల పీరియడ్స్ నొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.