హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకునే అద్భుతమైన మార్గాలు ఇవే!

మన జీవితకాలం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలి అంటే మన శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలి. అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే వీటికి రక్త సరఫరాను చేసి గుండె దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కనుక గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి రోజువారి కార్యకలాపాల్లో కొన్ని నియమాలు నిబంధనలు పాటిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి జీవితకాలం పాటు రక్షణ పొందవచ్చు.గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మొదట మీరు చేయవలసిందల్లా క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్ జోలికి అస్సలు వెళ్ళకండి. గుండె కండరాలను దృఢంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా కలిగిన ఆకుకూరలు, పండ్లు ,కూరగాయలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, చేపలను ఆహారంగా తీసుకోవాలి.

మన శరీరానికి తగినంత నీరు లభించకపోతే అవయవాల పనితీరు దెబ్బ తినడానికి కారణం ఒంట్లో నీటిశాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. దాంతో గుండె పనితీరు దెబ్బతిని రక్త సరఫరా రక్తం చిక్కబడితే గుండెజబ్బు గలవారికిది మరింత హాని చేస్తుంది. ఆధునిక యుగంలో టెక్నాలజీ విరిగిపోవడంతో మనకు శారీరక శ్రమ తగ్గి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కావున
వీలైనప్పుడల్లా నడవటం, మెట్లు ఎక్కటం వంటివి అలవాటు చేసుకుంటే మంచిది.

కార్టిజోల్‌ వంటి హార్మోన్లు గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. కొంత శారీరక శ్రమ కలిగిన నడక, యోగా, 20 నిమిషాల ధ్యానం, వ్యాయామంతో ఇలాంటి హార్మోన్ల స్థాయిని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.నిద్రలేమితో రక్తపోటు పెరుగరి గుండెజబ్బుకు దారితీస్తుంది. కావున సంపూర్ణ ఆరోగ్యానికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.