క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రకరకాల క్యాన్సర్ వ్యాధులు మానవ జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నాయి.మన శరీరంలో క్యాన్సర్ కణాలు మనకు తెలియకుండానే స్లో పాయిజన్ గా అభివృద్ధి జరిగి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే వరకు వ్యాధి తీవ్రతను మనం గుర్తించలేము. కాబట్టి క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టాలంటే మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.రోజువారి ఆహారంలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని నియంత్రించి ఔషధ విలువలు ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి అప్పుడే భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి ముప్పు నుంచి బయటపడవచ్చు.
కొన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్,ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు సహాయ సిద్ధంగా ఉంటాయి. వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ప్రమాదకర క్యాన్సర్ కణాలను నియంత్రించడమే కాకుండా ప్రమాదకర బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అటువంటి కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మనందరికీ అందుబాటు ధరల్లో లభించే టమోటోలో క్యాన్సర్ కణాలను అదుపు చేసి
లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్‌ను కలిగి ఉంటుంది. లైకోపీన్ ఉన్న ఆహార పదార్థాలు గుండె జబ్బు,ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ప్రతిరోజు మనం తినే ఆహారంలో పసుపు కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. దానికి కారణం పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియ కర్కుమిన్ అనే రసాయనం వంటివి మనలో రొమ్ము , ఉదర, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఉల్లి వెల్లుల్లిలో సమృద్ధిగా ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు క్యాన్సర్ కణాలను అదుపు చేయడంలో సహాయపడతాయి.వాల్‌నట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే టోకోఫెరోల్స్,ఫైటోస్టెరాల్స్ రొమ్ము క్యాన్సర్, ఉదర క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడతాయి.