మనలో చాలామంది నూరేళ్ల పాటు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని భావిస్తారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఇతర కారణాల వల్ల చాలామంది 70 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించడం లేదు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నూటికి నూరు సంవత్సరాల పాటు బ్రతికే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
దీర్ఘాయుష్షును కోరుకునే వాళ్లు ఒంటరిగా జీవించడానికి దూరంగా ఉండాలి. నలుగురితో కలిసిమెలిసి మెలుగుతూ సంతోషంగా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండటంతో పాటు షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు, ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జన్యు పరంగా వచ్చే సమస్యలను గుర్తించి ఆ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను స్వీకరించడం ద్వారా మెదడు చురుగ్గా పని చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
నచ్చిన విధంగా ఆరోగ్యానికి హాని కలగకుండా జీవనం సాగిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి చెడు చేసే దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. రోజూ పని ఒత్తిడితో ఎంత బిజీగా ఉన్నా ఒకే సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.
ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో ఎండ శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు వయస్సు ఆధారంగా 3 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నూరేళ్లు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.