షుగర్ వ్యాధి వస్తుందేమో అని భయపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే జన్మలో షుగర్ రాదంటూ?

Diabetes-treatment-1200x675

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో షుగర్ వ్యాధి గురించి వేర్వేరు విషయాలను వినే ఉంటారు. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. షుగర్ వ్యాధి వల్ల ప్రాణాలను కోల్పోయిన వాళ్లు సైతం ఉన్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే షుగర్ వచ్చిన తర్వాత బాధ పడే కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

కొన్ని చిట్కాలను పాటించడంతో పాటు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ప్రతిరోజూ మార్నింగ్ వాక్ చేయడం ద్వారా ఈ సమస్యను సులువుగా దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఏరోబిక్స్ చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సైక్లింగ్, ప్రాణాయామం చేయడం ద్వారా కూడా ఈ సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

ఇప్పటికే షుగర్ వచ్చిన వాళ్లు సైతం ఈ చిట్కాలు పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్, కొర్రలతో చేసిన అన్నం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చక్కెరతో చేసిన వంటకాలకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల సులువుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

కూరగాయలు, తీపి తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఆవు, గేదె పాల నుంచి తయారు చేసిన మజ్జిగను తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కు వీలైనంత దూరంగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.