Tea & Cigarette: సిగరట్టే డేంజర్..! టీ తాగుతూ సిగరెట్.. యమ డేంజర్..! ఎంతంటే..

Tea & Cigarette: ‘పొగతాగడం ఆరోగ్యానికి మంచిది కాదు’.. ఈ మాట సినిమా ప్రారంభంలోనూ.. ఇంటెర్వెల్లో కూడా చెప్తూంటారు. డాక్టర్లూ చెప్తారు.. సిగరెట్లు మానేయండి అని. కానీ.. ఈ అలవాటును మానుకోలేరు కొందరు. ఉదయాన్నే నిద్ర లేవగానే సిగరెట్టు, బాత్ రూమ్ లో సిగరెట్, టిఫిన్ అయ్యాక, మధ్యలో టీ తాగుతూ ఒకటి, భోజనం అయ్యాక, సాయంత్రం, రాత్రి, నిద్రపోయే ముందు.. ఇలా సిగరెట్ కాలుస్తూనే ఉంటారు. ఇలా సిగరెట్ ను ఫ్యాషన్, స్టయిల్ గా మొదలుపెట్టి అలవాటుగా మార్చేసుకుంటారు.

అయితే.. సిగరెట్టు అసలు కాల్చొద్దొనే మాటనే పక్కనపెడితే.. ఓ చేత్తో టీతాగుతూ మరో చేత్తో సిగరెట్ కాల్చడం యూత్ కి ఫ్యాషన్. పెద్దవారికి అలవాటు. అదొక ఆటిట్యూడ్ గా మారిపోతుంది. మద్యం తాగేటప్పుడూ అంతే. ఓ చేత్తో గ్లాస్.. మరో చేత్తో మందు. ఇది అలవాటు. కానీ.. ఇలా చేయడం ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఒక అధ్యయనం ప్రకారం టీ, మద్యం తాగుతూ సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరి అన్నవాహికకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని తేల్చారు నిపుణులు.

మామూలుగా సిగరెట్ తాగే వారికి క్యాన్సర్, గుండె ముప్పు ఎక్కువ అని డాక్టర్లు, అధ్యయనాలు ఎప్పుడూ చెప్తూంటాయి. కానీ.. మద్యం, టీతో కలిపి సిగరెట్ తీసుకుంటే ఈ ముప్పు మరింత ఎక్కువ అనేదే ఈ అధ్యయనంలో తేలింది. టీ తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ.. టీతో వీటిని తీసుకోవడం వల్లే ప్రమాదం. అమెరికా యూనివర్సిటీ నిపుణులు తేల్చింది కూడా ఇదే. నిజానికి మద్యం, సిగరెట్ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కానీ.. ఒత్తిడి, అలసట, ఫ్యాషన్.. ఇలా పరిస్థితులు మద్యం, సిగరెట్ వైపు తీసుకెళ్తాయి. నేటి రోజుల్లో మనిషి జీవనం, ఆహారం, పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో సమస్యలు ఎక్కువే. కానీ.. ఇవే సమస్యల నుంచి ఒత్తిడి నుంచి బయటపడే మార్గం మాత్రం సిగరెట్, మద్యం చూపవు. ఇవి లేకుండా మాత్రమే పరిస్థితులను జయించగలం. అందుకే వీటితో సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే.. ఇవి లేకుండా ఉన్న సమస్యలను తగ్గించుకోవడం ఉత్తమం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.