రోజూ ముఖానికి పౌడర్ రాసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్.. పౌడర్ వల్ల ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది ముఖానికి పౌడర్ రాసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పౌడర్ రాసుకోవడం వల్ల ముఖం మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కాన్సర్ (ఐఏసీఆర్) తాజాగా సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన వైరల్ అవుతోంది. పౌడర్ ఎక్కువగా వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

పౌడర్ల తయారీలో ప్రకృతి సిద్ధంగా లభించే మినరల్‌ టాల్క్ ను వినియోగిస్తారు. బేబీ పౌడర్లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో పౌడర్ టాక్ ను ఉపయోగిస్తారు. మహిళలకు అత్యధికంగా సోకే క్యాన్సర్లలో అండాశయ లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్ ముదిరే వరకు లక్షణాలు బయటపడవని తెలుస్తోంది. ఒవేరియన్ క్యాన్సర్లలో ప్రధానంగా ఎపిథీలియల్, స్ట్రోమల్ సెల్, జర్మ్ సెల్ అని ఉంటాయి.

కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన పౌడర్ల వల్ల పిల్లలకు సైతనం హాని కలుగుతోందని ఇప్పటికే పలు నివేదికలలో వెల్లడి కావడం జరిగింది. పౌడర్ కదా అని తేలికగా తీసుకుంటే ఆ పౌడర్ వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మహిళలు తమ ఉదరానికి దిగువ భాగంలో నొప్పి, ఇబ్బంది, ఉబ్బెత్తుగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

బ్లీడింగ్ అసాధారణంగా ఉన్నా, విరేచనాలు, మలబద్ధకం, ఉదరభాగం సైజు పెరిగినట్టు ఉండటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం లాంటి సమస్యలు వేధిస్తున్నా మహిళలు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. పౌడర్ వాడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని తప్పవచ్చు. ఎక్కువగా పౌడర్ వాడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.