మన శరీర పెరుగుదలకు దృఢత్వానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలను అందించడంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్డు,చేపలు,మాంసము, చిరుధాన్యాలు ముఖ్య పోషిస్తాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు లోపిస్తే శారీరక మానసిక ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడి అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ ఏ లోపం వల్ల కంటి సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మనలో విటమిన్ ఏ లోపాన్ని సరి చేసుకోవడానికి ఎక్కువమంది వీటమిన్ ఏ మాత్రలను మింగుతుంటారు. అయితే విటమిన్ ఏ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే తగిన జాగ్రత్తలను పాటించాలి లేకపోతే ఇంకొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. విటమిన్ ఏ కొవ్వులో మాత్రమే కరుగుతుంది. అందుకే కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉన్న గుడ్డు, బాదాం,జీడిపప్పును ఆహారంగా తిన్న వెంటనే విటమిన్ ఏ మాత్రలను వేసుకుంటే విటమిన్ ఏ మనం తీసుకున్న ఆహారంలో కొవ్వును వినియోగించుకొని కరిగి మన శరీరం సమృద్ధిగా విటమిన్ ఏ ను గ్రహిస్తుంది.
మోతాదుకు మించి విటమిన్ ఏ ను తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 10 వేలు iu కంటే ఎక్కువ పరిమాణంలో విటమిన్ ఏ ను తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం పొడిబారి అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం అలవాటు ఉన్నవారు విటమిన్ ఏ మాత్రలను అధికంగా మింగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కావున విటమిన్ ఏ మాత్రను మింగాలనుకుంటే కచ్చితంగా వైద్య సలహాలు పాటించి తీసుకోవడం మంచిది.