కరివేపాకు కషాయంలో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు? ఇలా చేస్తే మీ సొంతం!

కరివేపాకును దాదాపు అన్ని రకాల కూరలు, ఫ్రై, సూప్సు, సలాడ్స్ తయారీలో ఉపయోగిస్తారు. అయితే చాలామంది తినేటప్పుడు కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పడేస్తుంటారు. దీనికి కారణాలు ఏవైనా ఇప్పుడు చెప్పబోయే కరివేపాకు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఇకమీదట ఆ తప్పు అస్సలు చేయరు.కరివేపాకును కూరల్లోనే కాకుండా ప్రతిరోజు
ఉదయాన్నే కరివేపాకు కషాయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

కరివేపాకును నీళ్లలో బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని వడగట్టుకుని అందులో రుచి కోసం తేనే నిమ్మరసం వంటివి వేసుకొని సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కరివేపాకు కషాయాన్ని ప్రతిరోజు వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, విటమిన్ సి, మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.తీవ్ర పని ఒత్తిడి, మానసిక సమస్యతో బాధపడేవారు కరేపాకు కషాయాన్ని ప్రతిరోజు చేయిస్తే ఈ ఆకుల్లో ఉన్న అరోమా ఔషధ నాడీ కణాలను ఉత్తేజపరిచి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది.

మూత్రంలో మంట, కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే కరివేపాకు కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కరివేపాకు కషాయాన్ని సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.కరివేపాకు ఆకులో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ కంటి సమస్యలను తగ్గించి కంటి చూపులు మెరుగుపరుస్తుంది.

కడుపులో మంట, గ్యాస్, వికారం వంటి లక్షణాలతో ఉన్నప్పుడు కరివేపాకు కషాయాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కరివేపాకు రసాన్ని సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కరివేపాకు కషాయాన్ని సేవిస్తే వీటిలో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు,ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ వ్యర్ధాలను నియంత్రించి ఉబకాయం, రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.