Summer Drink: ఎండ వేడి నుంచి రిలీఫ్ ఇచ్చే ‘నిమ్మ-పుదీనా’ డ్రింక్

Summer Drink: వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బాడీ డీహైడ్రేషన్ కాకుండా నీరు ఎక్కువగా తాగుతాం. ఎండ వల్ల తగిలే వేడి, వడగాలి, చెమట, ఉక్కపోత.. వల్ల శరీరానికి నీరు ఎక్కువగా అవసరం. అయితే.. వీటన్నింటితో పాటు మరో డ్రింక్ కూడా శరీరానికి చక్కటి మేలు చేస్తుంది. మండు వేసవిలో ఎండ నుంచి ఉపశమనాన్ని ఇచ్చి బాడీని కూల్ చేస్తుంది. అదే నిమ్మ-పుదీనా డ్రింక్. నిమ్మకాయలు, పుదీనా ఆకు కలిపి చేసే ఈ డ్రింక్ శరీరానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

ఈ డ్రింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి కావలిసిన శక్తిని ఇస్తుంది. వేసవిలో ఫ్రిజ్ వాటర్ కోరుకుంటూ ఉంటాం. కానీ.. ఈ డ్రింక్ కు కూడా ఫ్రిజ్ కూలింగ్ వాటర్ పని చేయదు. కూలింగ్ లేని వాటర్ తో ఈ డ్రింక్ తయారుచేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చినా.. ఎండలో పని చేసినా.. బాడీని డీహైడ్రేషన్ ముప్పు నుంచి తప్పించాలన్నా నిమ్మ-పుదీనా డ్రింక్ కూడా ఉత్తమం. శరీరానికి ఎనర్జీతోపాటు, నోటికి మంచి టేస్ట్ తో మానసిక అలసటను తీరుస్తుంది.

లిమ్కా, స్ప్రైట్ లలో ఏదొక కూల్ డ్రింక్ హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి, ఫ్రెష్ పుదీనా ఆకులు ఒక కప్పు, నిమ్మకాయలతో నిమ్మరసం, నిమ్మకాయ నుంచి వచ్చిన రెండు టేబుల్ స్పూన్ల జ్యూస్, కొద్దిగా ఉప్పు. వీటన్నింటినీ తీసుకుని.. మొదట పుదీనా ఆకుల్నికొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్టులా చేయాలి. తర్వాత మరో అరకప్పు నీరు పోసి మరో 10 సెకన్లు మిక్సీలో బ్లెండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టగా వచ్చిందే పుదీనా రసం. దీనిని ఫ్రిజ్‌లో ఉంచాలి.

తాగాలనుకున్న సమయంలో ఫ్రిజ్ నుంచి తీసి అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా కూలింగ్ కావాలనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ ను మాత్రం వేసుకోవచ్చు. రెండు పెద్ద గ్లాసుల్లో జ్యూస్ పోసి అందులో మొదట తయారు చేసిన పుదీనా రసాన్ని రెండు గ్లాసుల్లో సమానంగా పొయ్యాలి. ఇప్పుడు లిమ్కా లేదా స్ప్రైట్ డ్రింకును ఆ జ్యూస్‌లో కలిపాలి. ఇదే నిమ్మ-పుదీనా జ్యూస్. ఇది మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. దాహం తీరుస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.