మొదలైన వేసవి తాపం… పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవికాలం ఇంకా పూర్తిగా రాకనే భానుడు భగభగమంటున్నాడు. ఇప్పటికే వేసవి తాపం పూర్తిగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. వేసవి కాలం మొదట్లోనే అధిక ఎండలు ఉండడంతో వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.ఇలా ఉష్ణోగ్రతలు పెరగటం చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వేసవికాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గాలిలో ఉండే కాలుష్య కారకాలు సూర్యుడు నుంచి వెలువడే యూవీ కిరణాల వల్ల పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురై అవకాశాలు ఉంటాయి.

ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండే పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడుకోవడానికి అవకాశం కల్పించకుండా ఉదయం సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడానికి అనుమతి ఇవ్వండి. అలాగే వీలైనంతవరకు ఎక్కువగా పండ్ల రసాలు, ఇతర పానీయాలను అందిస్తూ ఉండాలి. ఎండాకాలంలో దోమలు పిల్లలకు చాలా చిరాకు కలిగిస్తాయి. కనుక దోమల కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

ఇక ఎండకాలం పిల్లలు చాలా తొందరగా డిహైడ్రేషన్ కి గురవుతుంటారు. ఇలా డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే కాటన్ దుస్తులను ధరించి వారిని ఎండలో తిరగకుండా చూసుకోవడమే కాకుండా ఎక్కువగా నీటిని ఇతర పానీయాలను తాపించాలి.ఎండ తీవ్రత కారణంగా తరచూ చెమటలు రావడం శరీరం దురద పెట్టడం జరుగుతుంది. అందుకే ఇలా చెమటలు వచ్చిన ప్రతిసారి వారికి శుభ్రమైన గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. అలాగే ఎండాకాలంలో పిల్లలు చెమటకాయల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా చెమటకాయలతో బాధపడకుండా ఉండాలి అంటే అందుకు సంబంధించిన పౌడర్లు వేస్తూ వారిని వీలైనంతవరకు చల్లటి గాలి తగిలే ప్రదేశంలో తిరగనివ్వడం మంచిది.