థైరాయిడ్ లక్షణాలతో బాధపడుతున్నారా? రోజువారి ఆహారంలో ఇవి తప్పనిసరి!

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు సంఖ్య ఊహించని విధంగా రోజురోజుకు పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన శరీరంలో మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మన శరీర జీవక్రియలను నియంత్రించడంలో తోడ్పడుతుంది ఈ గ్రంధి పనితీరులో సమస్యలు తలెత్తితే మన శరీర జీవక్రియలు అస్తవ్యస్తమై ఊహించని విధంగా శరీర బరువు పెరగడం, కళ్ళు తిరగడం, అలసట, చికాకు వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్య మరి ఎక్కువ అవుతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి.

థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను సేవిస్తుంది. ఈ హార్మోన్ శరీర జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరులో వ్యత్యాసం ఏర్పడినప్పుడు థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా శ్రవిస్తే హైపర్ థైరాయిడిజం అనే సమస్య తలెత్తుతుంది. తక్కువగా శ్రవిస్తే హైపోథైరాయిడిజం వంటి సమస్య తలెత్తుతుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ మూలకం లోపిస్తే థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. కావున రోజువారి ఆహారంలో అయోడిన్ మూలకం తో పాటు సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, యోగా వంటివి అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే ధూమపానం మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజువారి ఆహారంలో మసాలా దినుసుల్లో ఒక్కటైన ధనియాలను తీసుకోవడంతోపాటు ప్రతిరోజు ధనియాల కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఒకసారి కాయలు విటమిన్ సి, అయోడిన్ తో పాటు అన్ని పోషకాలు లభిస్తాయి కావున ఉసిరికాయను తరచు ఆహారంలో భాగం అయ్యే విధంగా చూసుకోవాలి. పెసరపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ , యాంటీఆక్సిడెంట్లు, సంక్లిష్ట పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి చక్కటి ఆహారంగా పరిగణిస్తారు.