మందార పువ్వులు మరియు ఆకులతో జుట్టు సమస్యలన్నీ తొలగించి అందమైన, మృదువైన ,మెరిసే కురులను సొంతం చేసుకోవచ్చు. ఏంటి ఆశ్చర్య పోతున్నారా! అవును ఇది నిజమే మందార ఆకులు మరియు పూలల్లో సహజ ఔషధ గుణాలు జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, తెల్ల వెంట్రుకలు, చుండ్రు వంటి సమస్యలను తొలగించడంతోపాటు జుట్టు కుదుళ్లను దృఢపరిచి జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
మన ఇంటి పెరట్లో సమృద్ధిగా లభించే మందార ఆకులు మరియు పూలల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కావున జుట్టు సమస్యలకు ప్రధాన కారణమైన చుండ్రు సమస్యను అధిగమించడానికి నానబెట్టిన మెంతి గింజలలో కొన్ని మందారపు ఆకులను వేసి మెత్తని మిశ్రమంగా చేసుకొని తల కుదుళ్లకు రాసుకుంటే వీటిలోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు తల వెంట్రుకల కుదుళ్ళను దృఢంగా ఉంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
మందారం ఆకులను మెత్తని పేస్టులా మార్చుకున్న తర్వాత అందులో ఉసిరి పొడి లేదా ఉసరి రసాన్ని కలుపుకొని తల చర్మానికి అంటే విధంగా మిశ్రమంతో మర్దన చేసుకునీ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మందారం మరియు ఉసరిలో ఉండే విటమిన్ సి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చుండ్రు, జుట్టు రాలడం వంటివి తొలగిపోయి వెంట్రుకలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి.
మందార పువ్వులను ఆకులను మెత్తని మిశ్రమంగా మార్చుకొని అందులో కొబ్బరి నూనె మిక్స్ చేసి తల చర్మానికి అంటే విధంగా మర్దన చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా దృఢంగా తయారవుతుంది.
యుక్త వయసులోనే తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడేవారు మందార ఆకులు, పువ్వులను మెత్తటి పేస్టుగా మార్చుకొని అందులో తగినంత పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు అంటే విధంగా
మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలు సమస్య తగ్గి వెంట్రుకలు దృఢంగా తయారవుతాయి.
మందార చెట్టు ఆకులను మెత్తని పేస్టులా మార్చుకుని అందులో మంచి కలబంద గుజ్జును మిక్స్ చేసి తల చర్మానికి వెంట్రుకలకు అంటే విధంగా మర్దన చేసుకుంటే వెంట్రుకల్లో తడి శాతాన్ని పెంచి సిల్కీ గా ఉండునట్లు చేస్తుంది. వెంట్రుకలు రాలడాన్ని అరికట్టి ఒత్తయిన నల్లని కురులను మీ సొంతమవుతాయి.