మీ జుట్టు రాలుతోందా.. జుట్టు రాలడం ఆగాలంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా?

istockphoto-941321074-612x612

మనలో చాలామంది జుట్టు రాలడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం, ఇతర సమస్యల వల్ల జుట్టు రాలడం అనేది సామాన్యంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్యకు చెక్ పెట్టవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే జుట్టు సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జుట్టు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుడ్లు తినడం వల్ల మాంసకృత్తులు లభించే అవకాశం అయితే ఉంటుంది. గుడ్లలో బయోటిన్ రిచ్ డైట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. క్యారెట్ తినడం వల్ల కూడా జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.

 

ఓట్స్ తినడం వల్ల కూడా శరీరానికి అవసరమైన ఐరన్, జింక్ ,ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు లభించే అవకాశం ఉంటుంది. బచ్చలికూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆవకాడో తినడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇది తినడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.

 

ఈ చిట్కాలు అన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు. జుట్టు సమస్యలు మరింత ఎక్కువగా వేధిస్తే మాత్రం వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.