రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా ఈ సమస్యను అదుపులో ఉంచే పానీయం?

ప్రతిరోజు బెల్లం పానీయాన్ని సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.మన ఆహారంలో వైట్ షుగర్ కు బదులు బెల్లం ను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్, క్యాల్షియం ,సోడియం, పొటాషియం వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. బెల్లం పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి. బెల్లం పానీయాన్ని లేదా బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చల్లని నీళ్లను తీసుకొని అందులో బెల్లం ను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లల్లో వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. తర్వాత ఈ బెల్లం మిశ్రమాన్ని వడగట్టుకుని మరింత రుచి కోసం సబ్జా గింజలు, తులసి ఆకులు వంటివి జోడించి ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే బెల్లంలో అధికంగా ఉన్న ఐరన్ రక్త కణాల అభివృద్ధికి తోడ్పడి అలసట, నీరసం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రమాదకర రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.

మన శరీరంలోనీ చెడు మలినాలను తొలగించి అతి బరువు సమస్యను తొలగించడమే కాకుండా రక్త కణాల అభివృద్ధికి తోడ్పడి రక్తంలోని ప్రమాదకర కొలెస్ట్రాల్ని నివారించి అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. బెల్లంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీర ఎముకల దృఢత్వానికి పెరుగుదలకు సహాయపడి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తుంది.ప్రతిరోజు బెల్లం లేదా బెల్లం పానీయాన్ని ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం ,సోడియం మన శరీరంలో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గించి గ్యాస్టిక్ ఉబ్బసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. వీటిలో పుష్కలంగా ఉన్న ఫైబర్ జీర్ణ సమస్యలను తొలగించి చిన్న పేగు క్యాన్సర్ ను అరికడుతుంది.