మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో చర్మానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే చర్మానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చర్మ సంరక్షణ కోసం ఇష్టానుసారం క్రీమ్స్ ను ఉపయోగించడం వల్ల కూడా నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే.
పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చర్మ సమస్యలు చాలామందిని వేధిస్తున్నా ఆ సమస్యలకు చెక్ పెట్టడానికి చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పెదవులు నల్లగా మారడం, నల్లటి అండర్ ఆర్మ్స్ లాంటి సమస్యల వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
అరటిపండును తీసుకోవడం ద్వారా కొన్ని చర్మ సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. కాళ్లు పగిలిన చోట అరటితొక్కను అప్లై చేయడం ద్వారా పగుళ్ల సమస్య దూరమవుతుంది. నల్లటి అండర్ ఆర్మ్స్‌పై నిమ్మకాయను అప్లై చేయడం ద్వారా కూడా అదిరిపోయే ఫలితాలు సొంతమవుతాయి. పొడి పెదవులు, లేదా పగిలిన పెదవుల సమస్యతో బాధపడుతున్న వాళ్లు తొక్కలు తీసిన వెల్లుల్లిని పెదాలపై అప్లై చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు.
టమాటో జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా బ్లాక్ హెడ్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. టీ ట్రీ ఆయిల్‌తో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో టమోటా రసాన్ని అప్లై చేయడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.