అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా… ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలలో అజీర్తి సమస్య ఒకటి. అయితే ఈ సమస్య రావడానికి గల కారణం సరైన సమయానికి మనం భోజనం చేయకపోవడమే అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో చాలామంది ఉరుకులు పరుగుల జీవితంతో పాటు పరుగులు పెడుతూ సరైన సమయానికి తినడం మానేశారు. ఇలా చేయకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో అజీర్తి కూడా ఒకటి. చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడటం మనకు తెలిసిందే.

ఇలా సరైన సమయానికి భోజనం చేయకుండా ఉండటమే కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. చాలా మంది ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ ఫుడ్ ని లాగించేస్తున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. జీర్ణ సమస్యలను చిన్న సమస్యలుగా చూడకూడదు. ఎందుకంటే జీర్ణ సమస్యలు ఎన్నో పెద్ద సమస్యలుగా మారే అవకాశం లేకపోలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల పదార్థాలు తరచుగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు సమసిపోవడమే కాదు,ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు అనే సామెత మనకు తెలిసిందే.యాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడానికి ఈ సామెత వాడతారు. యాపిల్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ తిన్న ఆహారం బాగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. పొద్దున్న టిఫిన్ తినే ముందు కొద్దిగా అల్లం ర‌సం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారం తీసుకున్న తరువాత జీలకర్ర తీసుకోవడం కూడా మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల త్వరగా అజీర్తి సమస్య నుంచి మనం బయటపడవచ్చు.