అజీర్తి,కడుపులో మంట,ఎసిడిటీ వంటి సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్ ,జంక్ ఫుడ్ వంటి మసాలా, చెడు కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో మరియు సమయానికి భోజనం చేయలేని వారిలో ఎసిడిటీ,గ్యాస్ట్రిక్ ,అజీర్తి , కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగితే ప్రమాదకర జీర్ణాశయ క్యాన్సర్లు, అల్సర్లు ,అలర్జీలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం,అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు మన ఇంటి చిట్కాలతో ఇలాంటి సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఇలాంటి సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడేవారు భోజనం చేసిన వెంటనే ఫైబర్ ఎక్కువగా ఉండే బెల్లం ముక్కను తినడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అరుగుదల సమస్యతో బాధపడేవారు అన్నంలో పెరుగుకు బదులు మజ్జిగను తినడం మంచిది. లేదా
ఆహారం తిన్న తర్వాత పలుచని మజ్జిగలో కాస్త చక్కెర వేసుకొని సేవిస్తే మజ్జిగలో పుష్కలంగా లభించే లాక్టిక్ ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు అర టీస్పూన్ బేకింగ్ పౌడర్‌లో సగం నిమ్మకాయ రసాన్ని కలుపుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు తరచు కొబ్బరినీళ్లు తాగడం వల్ల వీటిలో పుష్కలంగా ఉన్న ఆమ్లాలు కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా మనల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని అయితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్తి , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక మసాల ఉపయోగించే మాంసాహారాన్ని తిన్నప్పుడు చిటికెడు
సొంపు గింజలు లేదా జీలకర్రను తింటే వీటిలో ఉండే ఔషధ గుణాలు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజు తులసి కషాయాన్ని సేవిస్తే వీటిలో ఉండే మైక్రోబియన్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు పొట్టలో ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులను అదుపు చేసి జీర్ణ సంబంధ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.