వేసవిలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగాల్సిన జ్యూస్ ఇదే?

benefits-of-sugarcane-juice

వేసవి తాపం అప్పుడే మొదలైంది శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ప్రతి ఒక్కరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వేసవిలో డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షణ పొందడానికి ఇప్పుడు చెప్పబోయే రుచికరమైన ఆరోగ్యవంతమైన జ్యూస్ ను ఇంట్లో తయారు చేసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంది వేసవి సీజన్ లో ఎక్కువగా లభ్యమయ్యే సపోటా పండ్లతో రుచికరమైన జ్యూస్ తయారు చేసుకొని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు రుచికరమైన సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.బాగా పండిన సపోటా పండ్లను తీసుకొని పై తొక్కను తొలగించి తేనె రంగులో ఉండే మధురమైన గుజ్జును తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి.తర్వాత మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలిపి
రుచికరమైన జ్యూస్ తయారు చేసుకోవచ్చు లేదా
తియ్యటి సపోటా గుజ్జుతో మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ వంటివి తయారు చేసుకుని తింటే సమ్మర్ లో ఆరోగ్యంగా ఉండొచ్చు.

వేసవి సీజన్ లో ప్రతిరోజు సపోటా జ్యూస్ ను సేవిస్తే డిహైడ్రేషన్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. సపోటా పండులో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్, సుక్రోస్, విటమిన్ సి ఎండ వేడి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంలో సహాయపడి రోజంతా మిమ్మల్ని అలసట ,నీరసం వంటి లక్షణాల నుంచి కాపాడుతుంది.సపోటా పండ్లలో పుష్కలంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ క్రియ రేటును పెంచి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తాయి.
అలాగే సపోటా పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లోవేంటరి గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించిఅన్ని ఇన్ఫెక్షన్లతో పాటు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజు సపోటా జ్యూస్ సేవిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది, నిద్రలేమి సమస్య, సెక్స్ సంబంధిత సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
అయితే సపోటా పండ్లలో కేలరీలు, సుక్రోస్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి కావున షుగర్ వ్యాధిగ్రస్తులు, ఉబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సపోటా జ్యూస్ తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది లేదా డాక్టర్ సలహా మేరకు సపోటా జ్యూస్ సేవిస్తే మరీ మంచిది.