అధిక గురక సమస్యతో బాధపడుతున్నారా… ఈ సింపుల్ చిట్కాతో గురక సమస్యకు చెక్ పెట్టండి!

సాధారణంగా చాలామంది అధిక పని ఒత్తిడి కారణంగా అలసిపోయి నిద్రపోయే సమయంలో గురక పెడతారు అయితే మరికొందరు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల గురక పెడుతూ ఉంటారు. ఇలా పలువురు కొన్ని కారణాల వల్ల గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా గురక పెడుతుండడం వల్ల వారికి నిద్ర రావచ్చు కానీ పక్కనున్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా గురక సమస్యతో బాధపడే వారికి అలాగే వదిలేస్తే అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.

ఇలా గురక సమస్యను అలాగే వదిలేస్తే అది స్లీప్‌ అప్నియాకు దారితీస్తుంది. స్లీప్‌ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక, సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. గురక తీవ్రమైతే జబ్బుగానే పరిగణించాలి. ఇలా అధిక గురక సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కూడా గురక సమస్యకు చెక్ పెట్టవచ్చు.శరీర బరువు నియంత్రణలో ఉండాలి. మెడ చుట్టూ ఉండే అధిక బరువు శ్వాసనాళంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చసే వ్యాయామం బరువును అదుపులో ఉంచుతుంది. ఇలా బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల గురక సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

నిద్రవేళకు ముందు ఆల్కహాల్, మత్తుమందులను నివారిస్తే అది గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి పడుకోవాలి. ఎడమ చేతివైపు తిరిగి పడుకోవడం వల్ల గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం వల్ల మీకు నాణ్యమైన నిద్ర పడుతుంది. అది గురకను తగ్గిస్తుంది. సరైన ఆహారం తీసుకోవడం, సరైన బీఎంఐ మెయిటెన్‌ చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం వంటివి గురకను నివారిస్తాయి. ఈ చిట్కాలను పాటించిన గురక సమస్య తగ్గలేదు అంటే వైద్యుని సంప్రదించడం మంచిది.