వాస్తు ప్రకారం ఇంటి చుట్టు పక్కల ఇది ఉన్నాయంటే ఇక దరిద్రం తాండవం చేసినట్టే?

మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మనం చేసే ప్రతి పని విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ ఆ పనిని వాస్తు ప్రకారం చేయడం చేస్తుంటారు. అయితే చాలామంది వాస్తు విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి తప్పుల వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు మీ ఇంటి పరిసరాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ఆవరణలో ఇళ్ల మొక్కలను అస్సలు ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు ముళ్ల మొక్కలను నాటకూడదని.. అలా చేస్తే ఇంట్లోని వాళ్లకు ప్రశాంతత ఉండదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలంకరణ కోసం అయినా సరే ముళ్లు ఉంటే మొక్కలను అస్సలు ఇంటి ఆవరణలో పెంచుకోకూడదని వాస్తు చెబుతోంది.
ఇంటి ఆవరణలో ఎలాంటి చెత్తను నిల్వ చేయకూడదని వాస్తు చెబుతోంది. చెత్తను ఇంట్లోనే కాకుండా ఇంటి ఆవరణలో కూడా నిల్వ చేయకూడదని.. ఇలా కాకుండా ఇంటి ఆవరణలో చెత్త, బూజు ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం ఉండదట. అలాగే దురదృష్టం, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

 

వాస్తు ప్రకారం ఇంటి ద్వారం అనేది ఇంటి, ఇంట్లో వాళ్ల స్థితిని మారుస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ కూడా రోడ్డు కన్నా కాస్త ఎత్తులో ఉండడం ఎంతో మంచిది. ఇలా ఉన్నప్పుడే ఆ ఇంటి పై ఎలాంటి నెగటివ్ ప్రభావం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారం రోడ్డు కన్నా తక్కువ ఎత్తులో ఉంటే మాత్రం ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని.. దీని వల్ల నష్టం తప్పదని వాస్తులో పేర్కొనబడింది. చాలామంది అందం కోసమో లేదంటే తెలియకనో ఇంటి ముందు రాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం కోసం వాడే మార్బుల్స్ కానీ ఇటుకలు కానీ రాళ్లు కానీ ఏవీ కూడా ఇంటి ముందు అస్సలు ఉంచుకోకూడదని వాస్తు చెబుతోంది. ఇలా వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంటి పరిసర ప్రాంతాలలో ఉంచకపోవడం ఎంతో మంచిది.