పెళ్లి తర్వాత గర్భధారణకు సరైన ముహూర్తం చూసి వధూవరులకు తొలిరాత్రి ఏర్పాటు చేస్తారు. అయితే తొలిరాత్రి సమయంలో చాలామంది వధూవరులు ఎన్నో అపోహలను కలిగి ఉంటారు. ఈ అపోహల వల్ల చాలామంది నిరుత్సాహాన్ని కూడా కలిగే ఉంటారు. అయితే మొదటి రాత్రి రోజు వధూవరులలో ఎలాంటి అపోహలు ఉంటాయి నిపుణులు ఏమంటున్నారు అనే విషయానికి వస్తే….
చాలామంది తమ జీవిత భాగస్వామితో లైంగికంగా కలవడం వల్ల లైంగిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు.అయితే ఒకే పార్ట్నర్ తో లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అయితే తొలిసారి కలయికలో పాల్గొనే వాళ్లు కండోమ్స్ ఉపయోగించాలని భావిస్తూ ఉంటారు.అయితే రక్షణ కోసం ఉపయోగించే ఈ కండోమ్స్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని నిపుణులు చెబుతున్నారు.
తొలి రాత్రి విషయంలో వధూవరులు అందుకు పూర్తిగా సిద్ధంగా ఉండరు కనుక కాస్త ఆందోళన ఉంటుంది.
ముఖ్యంగా అమ్మాయిలలో రక్తస్రావం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని తొలి కలయిక వల్ల ఏ విధమైనటువంటి రక్తస్రావం జరగదని నిపుణులు చెబుతున్నారు. ఇక అబ్బాయిలు కూడా మొదటి రాత్రి తమ కలయిక సక్సెస్ కాకపోవడంతో తమలో అంత సామర్థ్యంలేదని లైంగిక జీవితాన్ని అనుభవించడానికి అనర్హులం అంటూ ఆవేదన చెందుతుంటారు. అయితే ఇది పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు.దాదాపు చాలామందికి మొదటి రాత్రి తమ కలయిక సక్సెస్ కాదని ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు తెలియజేశారు. మీ సౌకర్యానికి అనుగుణంగా మొదటి రాత్రి కలయికలో పాల్గొనడం ఎంతో మంచిది కానీ ఇలాంటి అపోహలు ఉండకూడదు అని నిపుణులు చెబుతున్నారు.