మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య పురుషుల కంటే
మహిళలనే ఎక్కువగా వేధిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడితో తీరిక లేకపోవడం వల్ల వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం,సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం, సురక్షితం కాని లైంగిక చర్యలు, వంటివి మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంటను అశ్రద్ధ చేయకుండా మొదట్లోనే వైద్య సలహాలు పాటించి నయం చేసుకోవడం మంచిది.
కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం వల్ల కూడా మూత్రాశయలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ఒత్తిడి అధికమై మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. దాంతోపాటే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తపోటు,గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా మూత్రశయ ఇన్ఫెక్షన్ గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా కలుగుతుంది. రోజు తగినంత నీటిని తీసుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే బాధ నుంచి విముక్తి పొందడానికి కొన్ని చిట్కాలు పాటించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. ఫాస్ట్ ఫుడ్ ,సాఫ్ట్ డ్రింక్, టీ,కాఫీలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ప్రతిరోజు కాన్ బెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఈ పండ్లల్లో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియా , వైరస్ నశింపజేసి మూత్రశయ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉన్న ధనియాలను, పటిక బెల్లాన్ని ఉప్పును తీసుకొని మంచి నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత వచ్చే కషాయాన్ని చల్లార్చు కొని రోజుకు నొప్పి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు సేవిస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మంట, నొప్పి వంటి సమస్యలు తొలుగుతాయి. ఎక్కువ రోజులు మూత్ర శయ ఇన్ఫెక్షన్ బాధిస్తుంటే తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.