ఫ్రిజ్లో ఇలాంటి ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నారా… ఒక్కసారి ఆలోచించండి?

మనం పండ్లు ,కూరగాయలు ,పాలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రిజ్లో పెట్టడం సర్వసాధారణం. అయితే ఈ నియమం అన్ని ఆహార పదార్థాలకు వర్తించదు అంటున్నారు న్యూట్రిషన్ పరిశోధకులు.కొన్ని పండ్లు, కూరగాయలు ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి సహజ పోషక ఔషధ గుణాలు కోల్పోవడమే కాకుండా మనలో కొంత అనారోగ్య కారణాలకి కారణం కావచ్చు. కావున ప్రతిరోజు మనం వాడే ఫ్రిజ్లో ఎలాంటి కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవాలి ఎలాంటివి చేయకూడదు అన్న విషయంపై కొంత అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్లో పెట్టకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మనందరం అరటి పండ్లు,యాపిల్, బత్తాయి పండ్లను మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్లో పెట్టేస్తుంటా అది మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. అరటిపండును ఫ్రిజ్లో పెడితే వాటి సహజ గుణాలను కోల్పోవడమే కాకుండా నల్లగా కమిలిపోతుంది. ఆపిల్ ,బత్తాయి బొప్పాయి వంటి పండ్లను ఫ్రిజ్లో పెడితే సహజ రుచి కోల్పోతుంది. బ్రెడ్ , బిస్కెట్లను కూడా ఫ్రిజ్లో పెడుతుంటారు. ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఇవి తొందరగా త్వరగా డ్రై అవుతుంది. టమోటాని, వంకాయలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఫ్రిజ్లో పెడితే వాటిలో ఉండే సహజ పోషకాలు నశించిపోతాయి.

బంగాళ దుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి దుంప కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేస్తే నెలరోజుల పాటు నిల్వ ఉండి సహజ గుణాలు అలాగే ఉంటాయి. అదే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే చక్కెర శాతం అధికమవుతుంది. కూరల్లో వీటి రుచి మారుతుంది. పుచ్చకాయ లేదా దోసకాయలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల వాటిలో పుష్కలంగా ఉన్న పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్లు, సహజ రుచిని కోల్పోతుంది వీటిలో అత్యధిక నీటి నిల్వలు ఉంటాయి మరీ చల్లగా ఉంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా పూలను కూడా ఫ్రిజ్లోనే పెట్టేస్తుంటారు దీనివలన పూలల్లో వచ్చే పరిమళాలు ఫ్రిజ్లో ఉండే
ఆహార పదార్థాలు పూలవాసనతో కలిసిపోయి తినటానికి ఇబ్బందిగా ఉంటుంది.