సోయాబీన్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ…ఈ వ్యాధితో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి?

సోయాబీన్స్ లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పాలు, గుడ్లు, మాంసాహారంలో కంటే సోయాబీన్స్ లో అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభ్యమవుతుంది. కావున పోషకాహార లోపాన్ని సవరించడంలో సోయాబీన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోయాలో పుష్కలంగా ఉన్న కాల్షియం ,ఫైబర్ ,ఫాస్ఫరస్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల
విటమిన్ ఎ, బి1, బి2, బి3, బీ 6 వంటి మొదలగు పోషకాలు మన శరీర జీవక్రియలను మెరుగుపరిచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సోయాబీన్స్ ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సోయాలో అధికమొత్తంలో ప్రోటీన్లు, కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు మన శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల, ఆస్తియోఫోరోసిస్ సమస్యను తగ్గిస్తుంది. సోయాబీన్స్ లో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుంది.సోయా ఆహారం గర్భిణీ స్త్రీలకు మంచిది. వీటిలో అధికంగా బి కాంప్లెక్స్ విటమిన్స్, పోలిక్ యాసిడ్ ఉండడం వల్ల బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. .

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు సోయా తినడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చునని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సోయాను ఎక్కువగా తీసుకొనే ఆసియా ప్రజల్లో థైరాయిడ్ సమస్య లేనట్లు తేలింది.ముఖ్యంగా సోయాతో చేసిన వంటకాలు మెనోపాజ్ లక్షణాలను నెమ్మది చేస్తాయి. అలాగే వీటిలో ఐసోఫ్లేవోన్స్‌లో ఈస్ట్రోజెన్ లక్షణాలు ఎక్కువ.

సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదమేనని మరికొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటున్నప్పుడు, సోయా శరీరంలోని థైరాయిడ్ హార్మోన్‌ను పీల్చుకోవడంలో అడ్డుపడవచ్చు. అందువల్ల థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు సోయాను ఆహారంగా తీసుకునే విషయంలో వైద్యుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.