మట్టి పాత్రల్లో వంటకాలు తినడం వల్ల కలిగే లాభాలివే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి లభించి, జీర్ణక్రియ మెరుగుపడటం, రోగనిరోధక శక్తి పెరగడం లాంటి ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. మట్టి పాత్రలు వేడెక్కేటప్పుడు ఆహారంలోకి ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మట్టిలోని ఖనిజాలు జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మట్టిలోని ఖనిజాలు శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మట్టి పాత్రలో వండిన ఆహారం లేదా నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

మట్టిలోని ఆల్కలీన్ స్వభావం ఆహారంలోని ఆమ్లంతో చర్య జరిపి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. మట్టి పాత్రలో వంట చేయడం వల్ల తక్కువ నూనెతో వండటంతో పాటు తద్వారా ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మట్టి పాత్రలో వండినప్పుడు ఆహారంలోని పోషకాలు తక్కువగా నశించి, ఆహారం రుచికరంగా ఉంటుంది.

మట్టి పాత్రల్లో వండిన ఆహారానికి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. నాన్ స్టిక్, అల్యూమినియం పాత్రల కంటే మట్టి కుండలు ఆరోగ్యానికి సేఫ్ అని చెప్పవచ్చు. మట్టికుండలు వేడినీ, తేమనీ సమానంగా అందిస్తాయి. మట్టి పాత్రల్లో వండిన వంటలు తింటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. షుగర్ తో బాధ పడేవాళ్లకు మట్టి పాత్రలు ఎంతో మేలు చేస్తాయి.