మనలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ రుచిగా ఉండటంతో పాటు మళ్లీమళ్లీ తాగాలనే భావనను కలిగిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది ఫీలవుతారు. అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు సైతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
కూల్ డ్రింక్స్ వల్ల శరీరానికి ఎన్నో నష్టాలే తప్ప ఎలాంటి లాభాలు లేవు. బర్మింగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఎవరైతే తరచూ కూల్ డ్రింక్స్ తీసుకుంటారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 85 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే చిన్న వయస్సులోనే వృద్ధాప్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.
శీతల పానీయాలు తరచూ తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. తరచూ శీతల పానీయాలను తాగితే కొత్త ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూల్ డ్రింక్స్ వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం సులువుగా రక్షించుకోవచ్చు.