కరివేపాకు నూనెతో ఇన్ని వ్యాధులను తరిమికొట్టవచ్చా… ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

కరివేపాకు అని మనం చిన్న చూపు చూసినప్పటికీ అందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయనీ మనకు తెలిసిందే. చాలామంది వంటలు కరివేపాకు కనక కనపడితే టక్కున దానిని తీసి పడేస్తారు కానీ కరివేపాకుతో ఉన్నటువంటి ప్రయోజనాలు కనుక తెలిస్తే ఎవరు కూడా ఇకపై ఆ పని చేయరు. ఈ మధ్యకాలంలో కరివేపాకు ఆయిల్ ను సుగంధ ద్రవ్యంగా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ కరివేపాకు ఆయిల్ మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ప్రతి రోజు ఉపయోగించే ఏదైనా శుద్ధమైన వంట నూనెలో తాజా కరివేపాకు ఆకులను వేసుకొని కొన్ని రోజులు పాటు ఉంచినట్లయితే కరివేపాకు లోని ఔషధ గుణాలు ,పోషక విలువలు ఆ ఆయిల్ లో కలిసిపోతాయి.ఔషధ గుణాలతో పాటు, సువాసనతో కూడిన కరివేపాకు ఆయిల్ తయారవుతుంది. ఈ కరివేపాకు ఆయిల్ ని ప్రతిరోజు మన ఆహారంలో తీసుకున్నట్లయితే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు సుగంధ ద్రవ్యంగా మన వంటకాల్లో కరివేపాకు ఆయిల్ వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మన శరీరంలోని ప్రమాదకర క్యాన్సర్ కణాలను తొలగించి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. కరివేపాకులో పుష్కలంగా ఉన్న విటమిన్ ఎ, డి, ఈ, ఫైబర్ క్యాల్షియం పోలిక్ యాసిడ్ ఫాస్ఫరస్ వంటివి మన శరీర పెరుగుదలకు సహకరించి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ముఖ్యంగా కరివేపాకు ఆయిల్ ల్లో పోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అభివృద్ధి జరిగి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో భవిష్యత్తులో ప్రమాదకర రక్తహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.మధుమేహ వ్యాధితో బాధపడేవారు కరివేపాకు లేదా కరివేపాకు ఆయిల్ ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహకరిస్తుంది.