వేసవిలో కూల్ డ్రింక్స్ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉందట!

drinking-soda-wtih-braces-min

మనలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ రుచిగా ఉండటంతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతాయి. దీర్ఘకాలంలో కూల్ డ్రింక్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుండటం గమనార్హం. పలు ప్రముఖ కంపెనీలు కూల్ డ్రింక్స్ పై అదిరిపోయే ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే కూల్ డ్రింక్స్ లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం అయితే ఉంది. మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి చేసే హాని అంతాఇంతా కాదు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల వాటికి బానిసలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి.

కూల్ డ్రింక్స్ లో పోషకాలు సైతం చాలా తక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్స్ వల్ల లెఫ్టిన్ నిరోధకత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇన్సులిన్ సమస్యలు సైతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ కూల్ డ్రింక్స్ కొన్ని సందర్భాల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఇప్పటికే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు కూల్ డ్రింక్స్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీఇన్నీ కావు. శీతల పానీయాల వల్ల శరీరానికి కలిగే నష్టం మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. శీతల పానీయాలను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.