మహిళల నెలసరి నొప్పికి చెక్ పెట్టే చిన్న చిట్కా..!

మహిళలు పిరియడ్స్ వల్ల ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతూనే ఉంటారు. ఆ సమస్యల నుంచి అధిగమించేందుకు అనేక పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇందుకు మందులు కూడా ఉన్నాయి. అయితే.. ఇందుకు ఓ మహిళ కొత్త పద్ధతిని తానే కనుక్కుని స్వయంగా పాటించింది. దీంతో ఆమెకు పిరియడ్స్ టైమ్ లో రెగ్యులర్ గా ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం పొందింది. తాను పాటించిన పద్ధతిని టిక్ టాక్ లో పెట్టింది కూడా.

పీరియడ్స్ సమయంలో వచ్చే  పెయిన్‌ తగ్గించుకోవడానికి పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుంటారు. వ్యాయామాలు చేస్తారు.  ముడుచుకొని నిద్రపోతూంటారు. వేడి తగిలేలా నీటి బాటిల్‌ను హత్తుకొని నిద్రపోతారు. పొట్టకు తడి క్లాత్‌ చుట్టుకుంటారు. ఇలా వివిధ పద్ధతుల్లో తమ బాధను పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఇలాంటివేమీ చేయకుండా చిన్న చిట్కాతో ఈ బాధ నుంచి ఉపశమనం పొందొచ్చని.. చిన్న పెన్సిల్‌తో నొప్పిని మాయం చేయొచ్చని ఆ మహిళ నిరూపిస్తోంది.

లెసియామాక్‌ అనే మహిళ తన టిక్‌ టాక్‌ వీడియోలో.. వెనుక ఎరేజర్‌ ఉన్న పెన్సిల్‌ తీసుకొని చెవి దగ్గర మసాజ్‌ చేస్తూ నొప్పిని తగ్గించొచ్చని చెప్తోంది. మసాజ్ వల్ల పీరియడ్స్ లో పెయిన్‌ తగ్గడం ఆమె గమనించినట్టు.. ఒక నిమిషం పాటు ఇలా మసాజ్‌ చేస్తే మంచి ఫలితం ఉందని చెప్తోంది. రెండో చెవికి కూడా మసాజ్‌ చేయడం వల్ల మరింత ఫలితం వస్తోందని అంటోంది.

అయితే.. ఆమె చెప్పేది నిజమేనా? అనే అనుమానాలు సహజంగానే వస్తాయి. కానీ.. ఆమె వీడియోకు వచ్చిన కామెంట్లు లెసియామాక్ చిట్కా వీడియోకు వచ్చిన 15 లక్షల వ్యూస్ ఇది నిజమని నమ్మేలా చేస్తోంది. ‘పీరియడ్స్ టైమ్‌లో మందులు వేసుకునే అవసరం తప్పింది..’, ‘ఇది ఆక్యుపంక్చర్‌ తరహాదే’నని మరికొందరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను తక్షణమే సంప్రదించడం ఉత్తమం. అర్హత ఉన్న వైద్యుల అభిప్రాయాలకు పై కథనం ఎటువంటి ప్రత్యామ్నాయం కాదని తెలియజేస్తున్నాం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.