సాధారణంగా మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలోని రోజుకు ఎన్ని గంటల సమయం పాటు నిద్రపోయేవారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కానీ కొందరు మాత్రం రాత్రి, పగలు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు నిద్రమత్తులోనే ఉండి అనేక సమస్యలకు కారణం అవుతుంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో కడుపునిండా భోజనం చేశాక ఆఫీసులో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అప్పటికే బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి కాసేపు తృప్తిగా మనస్ఫూర్తిగా నిద్రపోవాలనిపిస్తుంది.
సాధారణంగా మధ్యాహ్న సమయానికి మనందరం అలసిపోయి ఉంటాం దానికి తోడు కడుపునిండా భోజనం చేసినప్పుడు నిద్ర రావడం సహజమే అని అందరూ అనుకుంటారు. అయితే మధ్యాహ్నం సమయంలో అతిగా నిద్ర రావడానికి కారణం అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడమే అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు అన్నం, బిర్యానీ వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే వీటిల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ వెంటనే గ్లూకోస్ గా మారి రక్తంలో కలుస్తుంది. దీని వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. ఆ అలసట వల్ల నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది.
అలాగే మధ్యాహ్న సమయంలో పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తింటే మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటూ, మత్తు భావనను కలిగించి కలిగించి ఆవలింతలు వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామన్న భావన కలిగిస్తుంది.అందుకే మధ్యాహ్న సమయంలో భోజనం చేయగానే ప్రతి ఒక్కరికి నిద్రపోవాలనే భావన కలుగుతుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మనం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా లేకుండా చూసుకోవాలి తద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.